బ్రేకింగ్ : “మా” ఎన్నిక‌ల నోటిషికేష‌న్ విడుద‌ల‌..!

-

మా ఎన్నిక‌ల నోటిషికేష‌న్ విడుద‌ల‌య్యింది. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్ లోని జూబ్లిహిల్స్ రోడ్ నెంబ‌ర్ 71 లోని జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్ లో ఉయ‌దం 8గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 3గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గనుంది. అదే రోజు సాయంత్రం 4గంట‌ల నుండి ఓట్ల‌ను లెక్కించి సాయంత్రం 7గంట‌లకు ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తారు. ఈ నెల 27 నుండి 29 వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రించనున్నారు. ఇదిలా ఉండ‌గా మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్టు సీవీఎల్ న‌ర‌సింహారావు, ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణులు ప్ర‌క‌టించారు.

కాగా ఆ లిస్ట్ లో తాజాగా న‌టుడు ర‌ఘుబాబు కూడా చేరారు. ర‌ఘుబాబు ఇప్ప‌టి వ‌ర‌కూ సైలెంట్ గా ఉండి తాను అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీచేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి షాక్ ఇచ్చారు. ఇక పోటీ చేస్తున్న వారిలో ప్ర‌కాష్ రాజ్ ముందు నుండి వ‌రుస మీటింగ్ లు ఏర్పాటు చేస్తూ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మంచు విష్ణు మా బిల్డింగ్ నినాదంతో ముందుకు వెళుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు గెలుస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version