రాజ్యసభ ఎన్నికల్లో బాబు వ్యూహం ఇదే, వైసీపీకి షాక్ తగులుతుందా…?

-

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు స్థానాలు వైసీపీకే దక్కుతాయి. కాని అనూహ్యంగా టీడీపీ తమ అభ్యర్ధిని నిలిపింది. వైసీపీ నుంచి మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పేర్లను వైసీపీ ఖరారు చేసింది. వారికి వైఎస్ జగన్ బీఫారాలు కూడా ఇచ్చేసారు. ఇక అనూహ్యంగా టీడీపీ నుంచి సీనియర్ నేత వర్ల రామయ్యని బరిలోకి దించారు.

వర్ల రామయ్యను చంద్రబాబు ఎందుకు బరిలోకి దింపారు అనేది ఎవరికి అర్ధం కాని ప్రశ్న. వాస్తవానికి టీడీపీకి గెలవడానికి సంఖ్యా బలం లేదు. కాని ఒక వ్యూహం దీని వెనుక ఉంది అంటున్నారు. టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, మద్దాలి గిరీ, కరణం బలరాం, వైసీపీకి మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు వీరిని ఇరుకున పెట్టడానికే చంద్రబాబు ఈ వ్యూహాన్ని సిద్దం చేసారని అంటున్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తన సభ్యులకు విప్‌ జారీ చేస్తుంది. ఓటు వేసే సభ్యుడు పార్టీ ఏజెంట్‌కు చూపించి, ఓటు వేయాల్సి ఉంటుంది. అలా వేయకపోతే మాత్రం వారిని అనర్హులుగా ప్రకటించే అధికారం టీడీపీ కి ఉంది. ఇప్పుడు వైసీపీకి మద్దతు ఇచ్చారు కాబట్టి ఆ ముగ్గురు టీడీపీ అభ్యర్ధికి ఓటు వేస్తారా లేక వైసీపీ చెప్పినట్టు చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వాళ్ళు వైసీపీకి ఓటు వేస్తే మాత్రం అనర్హులు అవుతారు.

కచ్చితంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. లేకపోతే పార్టీ పరంగా చర్యలు ఉంటాయి. పార్టీ విప్‌కు భిన్నంగా వీరు ఓటేస్తే.. వారిని అనర్హులను చేయడానికి చంద్రబాబు సిద్దమయ్యారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో ఆ ముగ్గురుని టార్గెట్ చేసి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇది ఆ ముగ్గురుకి ఇప్పుడు ఇబ్బందికరంగా మారిందని ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా మారిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version