అక్కడ పిల్లల్ని కంటే 8లక్షలు ఇస్తారు…

-

ప్రపంచ జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రభుత్వాలు ఎన్ని అవగాహానా చర్యలు చేపట్టినా సరే ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. చైనా ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి విజయవంతం అయింది. ఇప్పుడు భారత్ కూడా అదే విధంగా అనుసరించే యోచనలో ఉన్నా ప్రజలకు స్వేచ్చ ఎక్కువ కాబట్టి దానికి అంగీకరించలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక వంశాల మీద మోజు కూడా భారత్ లో ఎక్కువ కాబట్టి జనాభాను అదుపు చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు… మన దేశంలో ఇలా ఉంటే…

ఫిన్లాండ్ లో జనాభా కావాలి అంటున్నారు అక్కడి ప్రజలు… అసలు అక్కడ పిల్లలే పుట్టడం లేదట… ఏంటి నమ్మరా…? అవును అండి ఇది నిజం… పశ్చిమ ఫిన్లాండ్ ప్రావిన్సులో ఉన్న అతి చిన్న మున్సిపాలిటీ లెస్టిజార్విలో 725 మంది జనాభా ఉన్నారు. ఈ ఊరిలో 2012లో ఒక్క శిశువు మాత్రమే జన్మించింది. దీనితో ఆందోళన చెందిన అక్కడి ప్రభుత్వం 2013లో ‘బేబీ బోనస్’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం కింద ఇక్కడ బిడ్డకు జన్మనిచ్చిన ప్రతి జంటకూ 10,000 యూరోల పారితోషికం… అంటే మన కరెన్సీలో రూ.7,87,270 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆ మొత్తాన్ని ఏటా 1,000 యూరోల చొప్పున, 10 ఏళ్ళ పాటు వారికి చెల్లిస్తారు. ఈ పథకం ప్రారంభించిన తర్వాత ఏడేళ్లలో ఇక్కడ 60 మంది పిల్లలు పుట్టగా అంతక ముందు ఏడేళ్ళలో 38 మంది మాత్రమె పుట్టారట. దీనితో అక్కడి ప్రజలు ఈ పథకం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం లేకపోతే కొన్నాళ్ళకు తమ ఊరే అంతరించే ప్రమాదం ఉండేది అని ఇప్పటికే ఊరిలో వృద్దుల సంఖ్య భారీగా పెరిగిపోయిందని ఈ పథకం కారణంగా ఊరిలో పిల్లల సందడి మొదలైందని వారు సంబరపడిపోతున్నారు. ఈ పథకం కోసం ఆ దేశ ఆర్ధిక శాఖ ప్రత్యేక నిధులు కేటాయించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version