శ్రీ చైతన్య కాలేజీలో ఉరేసుకుని మరో విద్యార్థి ఆత్మహత్య..

-

హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో మరో విద్యార్థి బలవణ్మరనానికి పాల్పడ్డాడు.ఈ నెలలో ఇది మూడో సూసైడ్. నారాయణ,శ్రీ చైతన్య కాలేజీల్లో చదువుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు సమాచరం.పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన కౌశిక్ రాఘవ (17) మియాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు హాస్టల్ గదిలో శుక్రవారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, విద్యార్థి ఆత్మహత్యను కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచింది.

విషయం తెలియడంతో విద్యార్థి తల్లిదండ్రులు,బంధువులు శ్రీ చైతన్య కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి, మానసిక వేధింపులే వారి ఆత్మహత్యలకు కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నవ తెలంగాణ విద్యార్థి శక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పవన్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version