కల్కి’లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ గా ఉంటుంది: సంతోష్ నారాయణన్

-

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’ . ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898AD’ సినిమా మ్యూజిక్ గురించి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత బాగుండాలనే ఉద్దేశంతో మరోసారి దానిపై పనిచేస్తున్నా. అది చాలా స్పెషల్, మాస్గా ఉండబోతోంది’ అని పేర్కొన్నారు. కాగా ఈ సినిమా మే 9న విడుదల కానుంది.

ఈ మూవీ లో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగ ,అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్  తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పరశురాముడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ మూవీలో విజయ్ దేవరకొండ, నాని భాగమైనట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news