మెగా ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్… చిరంజీవి సినిమాలకు గుడ్ బై..?

-

మెగా ఫాన్స్ కి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్… చిరంజీవి ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం ఇప్పుడు వాళ్ళను కంగారు పెడుతుంది. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయనకు వయసు మీద పడుతుంది. దీనితో ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పాలి అని చిరంజీవి భావిస్తున్నారని టాలీవుడ్ వర్గాలలో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఆయన కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య సినిమా వాయిదా పడింది. ఈ సినిమాలో ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఆయన పక్కన రష్మిక మంధన నటిస్తుండగా… చిరంజీవి పక్కన కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత ఇక చిరంజీవి ఇప్పుడు పూర్తిగా సినిమాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.

ప్రస్తుతం చిరంజీవి లూసిఫర్ అనే రీమేక్ సినిమాను కూడా లైన్ లో ఉంచారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇక సినిమాల నుంచి పూర్తి స్థాయిలో తప్పుకునే ఆలోచనలో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి తన సన్నిహితుల వద్ద సినిమాల నుంచి తప్పుకునే విషయమై చెప్పినట్టు సమాచారం. చిరంజీవి ప్రస్తుతం 70 కి దగ్గరలో ఉన్నాయని కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయని అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version