స్మార్ట్ ఫోన్లు వాడే వారికి బ్యాడ్ న్యూస్..ఆ ఫీచర్ అవుట్..

-

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు.. అయితే మొన్నటివరకు టాప్ లో ఉన్న ఫీచర్ ను ఇప్పుడు తీసి వేస్తున్నట్లు తెలుస్తుంది.అలెక్సా బిల్ట్ ఇన్ స్మార్ట్‌ఫోన్స్ వాడే వారికి బ్యాడ్ న్యూస్. అమెజాన్ తన బిల్ట్ ఇన్ అలెక్సా సర్వీసులను నిలిపివేయనుంది.ఆండ్రాయిడ్ డివైజ్‌లలో అమెజాన్ బిల్ట్ ఇన్ అలెక్సా సర్వీసుల అందుబాటులో ఉండకపోవచ్చు. వచ్చే ఏడాది మార్చి 31 నుంచి స్మార్ట్‌ఫోన్లలో అమెజాన్ అలెక్సా బిల్ట్ ఇన్ సర్వీసులు అందుబాటులో ఉండవని చెప్పుకోవచ్చు.

అమెజాన్ ఇప్పటికే యూజర్లకు ఈ విషయాన్ని తెలియజేసిందని పేర్కొంది. అమెజాన్ బిల్ట్ ఇన్ అలెక్సా సర్వీసులు అందుబాటులో ఉండవని తెలిపింది. అమెజాన్ అలెక్సా అనేది యాపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్ మాదిరిగానే పని చేస్తుంది. ఫోన్‌ లాక్‌లో ఉన్నా కూడా పని చేస్తుంది. యాప్ ఓపెన్ చేయాల్సిన పని లేదు.ఆండ్రాయిడ్ యూజర్లు అలెక్సాను వాయిస్ కమాండ్స్ ద్వారా సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్స్ ద్వారా ఫోన్‌లో అవసరమైన సర్వీసులు పొందొచ్చు.

మీరు చెప్పినట్లు అలెక్సా చేసి పెడుతుంది. ఫోన్ స్క్రీన్ లాక్‌లో ఉన్నా కూడా అమెజాన్ అలెక్సా పని చేస్తుంది. అందువల్ల చాలా మంది అలెక్సా ద్వారా అవసరమైన సర్వీసులను సులువుగా పొందుతున్నారు..వన్‌ప్లస్ 10 ప్రో 5జీ, వన్‌ప్లస్ 10టీ 5జీ, మోటరోలా ఎడ్జ్ 2022, మోటో జీ7 వంటి పలు స్మార్ట్‌ఫోన్లలో అమెజాన్ బిల్ట్ ఇన్ అలెక్సా ఫీచర్ ఉంది..అయితే ఈ సర్వీసును అమెజాన్ ఎందుకు నిలిపివేస్తుంది అనేది మాత్రం తెలియలేదు.ఇకపోతే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు 2023 మార్చి 31 తర్వాత కూడా అలెక్సా సర్వీసులు పొందొచ్చు. అయితే అలెక్సా యాప్ ఓపెన్‌లో ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మీరు చెప్పినట్లు మీ ఫోన్ వింటుంది. హ్యాండ్స్ ఫ్రీ సర్వీసులు పొందొచ్చు…ఏది ఏమైనా కూడా ఈ సర్వీసు నిలిచిపోవడం పై నిరాశను వ్యక్తం చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version