దారుస్సలంలో ఎంఐఎం నిర్వహించ తలపెట్టిన సభకు సీఎం రేవంత్ సహకరిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. బడాబాబులు, బడాచోర్లు కలిసి మీటింగ్‌లు పెట్టుకున్నారన్నారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని గుర్తుచేశారు.పాతబస్తీలో ఎక్కడైనా ఆయన విగ్రహం ఉందా? అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టుపై తమకు నమ్మకం ఉందని, తాము న్యాయస్థానానికి వ్యతిరేకంగా ఏ పని చేయబోమన్నారు. రాష్ట్రంలో వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు ఎంత పరిహారం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా, నిన్న దారుస్సలం సభలో అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రధాని మోడీ ముస్లింలను విభజించి బలహీన పరిచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ముస్లింలపై కక్షసాధింపుగా రాజ్యాంగ వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. దాన్ని ఉపసంహరించుకునేంత వరకూ అన్ని వర్గాలతో కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని కీలక ప్రకటన చేశారు. అంబేడ్కర్ కంటే తానే గొప్పవాడినని మోడీ భావించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించగా.. తాజాగా బండి కౌంటర్ ఇచ్చారు.