తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. త్వరలోనే ఆర్టీసీలో భారీగా ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ భర్తీతో వేల మందికి ఉపాధి లభించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీలో త్వరలో 3,038 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని వివరించారు.
ఈ 3వేలకు పైగా పోస్టుల్లో 2 వేల డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) జాబ్స్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) పోస్టులు, 25 డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ జాబ్స్, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ ఉద్యోగాలు, 23 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు, 11 సెక్షన్ ఆఫీసర్ (సివిల్), 6 అకౌంట్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అర్హులు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు సూచించారు.