బద్వేలు పోరు…బీజేపీ ఫుల్ కామెడీ..!

-

తెలంగాణలోని హుజూరాబాద్ ఉపఎన్నికతో పాటే ఏపీలో బద్వేలు స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ఫోకస్ మొత్తం హుజూరాబాద్ పైనే ఉంది. ఎందుకంటే అక్కడ పోరు కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా జరుగుతుంది. అందుకే అందరి దృష్టి హుజూరాబాద్ పైనే ఉంది. ఇక ఏపీలో జరుగుతున్న లో ప్రధాన ప్రతిపక్షాలు పోటీలో లేవు. అందుకే ఈ ఉపఎన్నికపై ఎక్కువ ఫోకస్ లేదనే చెప్పాలి.

బద్వేలు పోరులో ఎలాగో టీడీపీ తప్పుకుంది…అలాగే జనసేన కూడా పోటీ నుంచి తప్పుకుంది. కానీ ఇక్కడ బీజేపీ బరిలో దిగింది…అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తుంది. దీంతో బద్వేలు పోరు ఏకగ్రీవం కాలేదు. అయితే ఈ పోరులో క్లియర్ కట్‌గా వైసీపీ గెలుస్తుందని చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగానే బద్వేలు వైసీపీ కంచుకోట…దీనికి తోడు వైసీపీ అధికారంలో ఉంది. ఇక సానుభూతి కూడా ఉంది. ఇవన్నీ చూసుకుంటే వైసీపీ గెలుపు ఫిక్స్…ఇక మెజారిటీ ఎంత అనేది చూసుకోవాలి.

కానీ ఇక్కడ బీజేపీ హడావిడి ఎక్కువగా ఉంది..అసలు గత ఎన్నికల్లో నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోలేదు. అయితే ఇప్పుడు ప్రధాన పార్టీలు పోటీలో లేకపోవడంతో, తామే వైసీపీకి పోటీ అనుకుని బీజేపీ హడావిడి చేసేస్తుంది…వైసీపీకి చెక్ పెట్టేస్తామన్నట్లుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు.

ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని, ఓడిపోతామన్న భయాందోళన అధికార పార్టీలో మొదలైందని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. అయితే ఈ మాటలు కాస్త కామెడీగా ఉన్నా సరే, బీజేపీ కాన్ఫిడెన్స్ అలా ఉంది. అంటే ఇక్కడ టీడీపీ ఓట్లు లాగేయాలని బీజేపీ చూస్తుంది. కనీసం ఆ ఓట్లు పడేలా చేసుకుంటే పరువు నిలుస్తుందని బీజేపీ అనుకుంటుంది. కానీ బద్వేలులో ఆ పరిస్తితి కనబడటం లేదు…మళ్ళీ బీజేపీ నోటా ఓట్లు దాటితే గ్రేట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version