దేశవ్యాప్తంగా పెద్ద, చిన్న కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. అందుకు కారణం కొన్ని ఉద్దేశపూర్వకంగా నమోదు చేసిన కేసులు పదే పదే వాయిదా పడుతుంటాయి. దీనికి తోడు న్యాయవ్యవస్థల్లో జడ్జిల కొరత కూడా ఓ కారణం కావొచ్చు.
అయితే, తాజాగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కామెంట్ చేశారని.. విమర్శలు చేశారని ఇటీవల పోలీసులు కొందరిని కారణం లేకుండా అరెస్టు చేసి జైలు పాలు చేస్తున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు అరెస్టు ఎందుకు చేశారో బాధితుడికి ముందుగా కారణం చెప్పాలి. లేనియెడల ఆ కారణం చూపి అతనికి బెయిల్ ఇవ్వొచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టంచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టు చేసే ముందు నిందితుడికి కారణాలు చెప్పడం తప్పనిసరి అని కోర్టు వెల్లడించింది.