హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూములు అటవి శాఖకు చెందినవి కావని.. తెలంగాణ ప్రభుత్వానికి చెందినవని తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది అటవీ శాఖ భూమి అని ఎక్కడా లేదని అన్నారు. 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఈ భూములను ప్రభుత్వం టేకోవర్ చేయడం జరిగిందని వెల్లడించారు.హెచ్‌సీయూ విద్యార్థులు, డైరెక్టర్, ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన తెలిపారు.