ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం అడవుల్లో ఒక్కసారిగా కార్చిచ్చు రగిలింది. మంటలు పెద్దఎత్తున వ్యాప్తించాయి. దీంతో అడవిలోని వేలాది చెట్లు అగ్నికీలలకు ఆహుతి అవుతున్నాయి. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి కాళేశ్వరం వెళ్తుండగా..
అక్కడ ఎండల తీవ్రత సాధారణ స్థాయి కంటే పెరిగాయి. దీంతో అడువుల్లో అగ్గి రాజుకుంది. ఎండలకు తోడు కాళేశ్వరం ఆలయ సందర్భన కోసం వచ్చిన భక్తులు..అడవిలో వంటలు చేసుకుని నిప్పు ఆర్పకపోవడం వలన పెద్దఎత్తున అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. దీనిపై ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టాలని.. వెంటనే మంటలను అదుపులోకి తీసుకుని రావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.