రాయలసీమకు ఆన్యాయం జరిగితే సొంత పార్టీని సైతం వ్యతిరేకిస్తా – బైరెడ్డి

-

రాయలసీమకు ఆన్యాయం జరిగితే సొంత పార్టీని సైతం వ్యతిరేకిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత బైరెడ్డి. నీటి పంపకం విషయం లో బిజెపి ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్వహిస్తున్న అప్పర్ బద్రా ప్రాజెక్ట్ ను వెంటనే ఆపాలని..అప్పర్ భద్రా ప్రాజెక్ట్ కు కేంద్రం అనుమతులు ఇవ్వటం తీవ్ర అన్యాయమన్నారు.

ఆ ప్రాజెక్టు రాయలసీమనే కాకుండా తెలంగాణలోని మూడు జిల్లాలు ఎడారిగా మారుతాయని…అప్పర్ బద్రా ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తూ ఈనెల 25 నుండి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు బైరెడ్డి. 28వ తేదీ ఆదోనిలో భారీ బహిరంగ సభ… పార్టీలకతీతంగా నేతలు, ప్రజా సంఘాలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధ్వర్యంలో లో నిర్వహించే పాదయాత్రకు, ప్రజా ప్రదర్శనకు పూర్తి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ కు ఆన్యాయం జరిగితే సొంత పార్టీ నీ సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తానని..ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి వద్దు బ్రిడ్జ్ కం బ్యారేజి ముద్దు అనే నినాదం తో సంగేశ్వరం వద్ద ప్రజా ప్రదర్శన నిర్వహించారు బైరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news