మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? మంచిగా డబ్బులు దాని నుండి సంపాదించాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ బిజినెస్ ఐడియా ని చూడండి. ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు అనుసరించారు అంటే లక్షల్లో లాభాలు వస్తాయి. ఏదైనా ఒక షాప్ ని పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ బిజినెస్ బాగుంటుంది.
స్టేషనరీ షాపు ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సంవత్సరం పొడువున స్టేషనరీ కి మంచి డిమాండ్ ఉంది. పుస్తకాలు, పెన్నులు మొదలు అన్ని రకాల స్టేషనరీ సామాన్లని మీరు అమ్మొచ్చు. దీనితో చక్కగా డబ్బులు వస్తాయి. స్టేషనరీ షాప్ ని పెట్టుకోవడానికి మంచి స్కూల్ లేదా కాలేజ్ ఉన్న చోటని పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి స్టేషనరీ షాప్ తో పాటుగా మీరు ఒక జిరాక్స్ షాప్ ని కూడా పెట్టుకోవచ్చు. జిరాక్స్ మిషన్ ని కొనుగోలు చేసి మీరు మీ షాప్ లో జెరాక్స్ లని కూడా తీయొచ్చు.
స్కూల్స్ ఉన్నచోట దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి రిస్క్ ఉండదు పైగా ఎక్కువగా లాభాలని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారానికి మీరో ఒక లక్ష నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వుంది. దీనికి కావాల్సిన సామాన్లని మీరు హోల్సేల్ మార్కెట్ కి తెచ్చుకోవాలి. తక్కువ పెట్టుబడితో స్టేషనరీ వ్యాపారం ని మీరు మొదలు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఒకవేళ షాప్ లో ఎక్కువ పని ఉంటే మీరు సహాయం కోసం ఎవరినైనా పెట్టుకుని పని చేయించుకోవచ్చు. పుస్తకాల బైండింగ్ లామినేషన్ కూడా మీరు షాప్ లో చేయచ్చు.