బాలయ్య బాబు సినిమా సూపర్ స్పీడ్ తో..!!

-

నందమూరి బాలకృష్ణ  ప్రస్తుతం తాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి లో నటిస్తున్నారు.ఇక  తర్వాత సినిమా అనిల్ రావిపూడి తో చేస్తున్న సంగతి తెలిసిందే. దాని కోసం అనిల్ రావిపూడి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసారట. దీనిలో కూడా బాలయ్య కు తగ్గట్టుగా గా ఉండేలా యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ ఉండనున్నాయట. దీనికి బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఐ డోంట్ కేర్ బ్రో అనే టైటిల్ పెడుతున్నారని తెలుస్తొంది.

బాలయ్య బాబు  108వ చిత్రంగా తెరకెక్కుతున్న అనిల్ రావిపూడి  డైరెక్షన్ లో జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.బాలయ్య చాలా ఎనర్జిటిక్, ఎంతో మంది హీరోలు సినిమా తర్వాత రిలాక్స్ కోసం ఫారిన్ ట్రిప్ వేస్తూ ఉంటారు. కాని బాలయ్య బాబు కు అలాంటి రెస్ట్ లు అవసరం లేదు. బరిలోకి దిగితే రామబాణం లా దూసుకొని పోవాల్సిందే.బాలయ్య ఏ సినిమాకు ఎక్కువ సమయం తీసుకున్న పరిస్థితి లేదు.

బాలయ్య లాంటి హీరో దొరికితే అనిల్ రావిపూడి  లాంటి డైరెక్టర్ కు పండగే.సరైన జోడి. అనిల్ రావిపూడి సైతం షూటింగ్ త్వరగా పూర్తి చేయడంలో ఘనుడు. మహేష్ వంటి స్టార్ తోనే అనిల్ ఏడెనిమిది నెలల్లో షూట్ పూర్తి చేసి సంక్రాంతి విడుదలకు సిద్ధం చేశాడు. కాబట్టి బాలయ్య మూవీ వచ్చే ఏడాది వేసవికి రెడీ చేసినా ఆశ్చర్యం లేదు. ఇక రీసెంట్ గా ఈ సినిమా కోసం నటుడు శరత్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా అనిల్ రావిపూడి ఆయనకు వెల్కమ్ చెబుతూ పోస్ట్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version