ఆయనో చిన్న దర్శకుడు.. అంటే మనిషి చిన్న కాదు. ఇంచు మించు ప్రభాస్ అంత హైట్ ఉంటాడు. కానీ చిన్న సినిమాలే చేశాడు.. పెద్ద హీరోలతో ఇంతవరకూ సినిమా చేయలేదు. అంటే అవకాశాలు రాక కాదు.. ఆయన తరహా అలాంటింది. కథకు తగ్గటుగా హీరో ఉండాలి తప్ప.. హీరో కోసం కథ కాదు అన్నది ఆయన కాన్సెప్టు.
ఆయనే రవి బాబు.. బాలకృష్ణే వచ్చి మిమ్మల్ని అడిగినా సినిమా చేయడం లేదట. ‘ఏమయ్యా.. నువ్వు అందరితోనూ సినిమా చేస్తావ్. నాతో ఎందుకు తీయవు’ అని బాలకృష్ణగారు అడుగుతుంటారట. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత ఒకరోజు రాత్రి ఫోన్‌చేసి ఇదే విషయాన్ని అడిగారట.
అందుకు రహబాబు.. ‘సర్ మీ చిత్రానికి దర్శకత్వం వహించడం నాకు గౌరవం’ అని నేను అంటే ‘నీ దర్శకత్వంలో చేయడం కూడా నాకు గౌరవం’అని బాలయ్య అన్నారట. ఆయనతో వ్యక్తిగతంగా మంచి అటాచ్‌మెంట్ ఉంది. నా దగ్గరున్న కథల్లో బాలకృష్ణగారు సరిపోతారా లేదోనని ఆలోచిస్తా. ఒక పెద్ద హీరో కోసం కథ రాసుకోవడం సరైన పద్ధతి కాదు.. అంటున్నారు రవిబాబు.
నేను రాసుకున్న కథకు ఎవరు సరిపోతారో చూసుకుని వారితో చేయడం సరైన పద్ధతి. ఒక హీరోకు అనుగుణంగా సినిమాను తీయడం నాకు ఇష్టం ఉండదు. ఆ హీరోను ఎలివేట్ చేస్తూ 100 షాట్‌లు తీయలేను. అవి తీయడానికి ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. మిగతావాళ్లు చేసేది నేను చేయలేను. నేను చేసేది మిగిలిన వాళ్లు ఎవరూ చేయలేరు..అని ఖరాఖండీగా చెబుతున్నారు రవిబాబు.