చంద్రబాబు వెన్నుపోటుపై బాలయ్య హాట్ కామెంట్..!

-

నందమూరి తారక రామారావు దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ పగ్గాలను ఎలా తీసుకున్నాడు అని అడిగితే.. చాలా మంది చెప్పే సమాధానం వెన్నుపోటు. అందుకే చంద్రబాబువి వెన్నుపోటు రాజకీయాలంటారు చాలా మంది ఆయన ప్రత్యర్ధులు. నందమూరి కుటుంబ సభ్యులను అడ్డు పెట్టుకొని మరి ఆయన ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారని అంటారు కొందరు. అయితే ఆ తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం, ముఖ్యమంత్రి అవ్వడం కూడా జరిగింది. అయినా వెన్నుపోటు మచ్చ మాత్రం పోలేదు.

అయితే తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఓ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు వెన్నుపోటు గురించి ప్రశ్న ఎదురవ్వగా.. ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. చంద్రబాబు గురించి కొంత మంది వెన్నుపోటు గాడిదగుడ్డు అని మాట్లాడుతుంటారని అవి తనకు అర్థం కావని ఇప్పటి పరిస్థితిని బట్టి అందరం కలిసి పార్టీని కాపాడుకుంటూ ఉన్నామని అందులో తాము కూడా ఉన్నామని తిరిగి అధికారంలోకి కూడా వచ్చామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version