కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య

-

ఈరోజు నుండి అందరు ఎదురుచూస్తున్న ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తో ఐపీఎల్-2023కి తెరలేవనుంది. నేడు ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్ ద్వారా బాలయ్య క్రికెట్ కామెంటేటర్ గా పరిచయం కానున్నారు. జై బాలయ్య అంటూ హోస్ట్ నందూ, ఇతర కామెంటేటర్లు ఆశిష్ రెడ్డి, కల్యాణ్ కృష్ణ తదితరులు బాలయ్యకు స్వాగతం చెప్పారు.

బాలకృష్ణ ఈ సందర్బంగా మాట్లాడుతూ, తాను స్కూల్ రోజుల్లో క్రికెట్ ఆడేవాడ్నని, కాలేజీ రోజుల్లో తనకు అజహరుద్దీన్, కిరణ్ కుమార్ రెడ్డి (మాజీ సీఎం) వంటి మేటి క్రికెటర్లతో పరిచయం కలిగిందని తెలిపారు. ఆ తర్వాత స్టూడియోలోకి ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు కూడా వచ్చారు. బాలయ్య వచ్చాడు… ఇవాళ దబిడిదుబిడే అంటూ ఇతర కామెంటేటర్లు తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఐపీఎల్ లో తన ఓటు సన్ రైజర్స్ కే అని బాలకృష్ణ వ్యక్తపరిచారు.

భువనేశ్వర్ కుమార్, అదిల్ రషీద్, హ్యారీ బ్రూక్, ఉమ్రాన్ మాలిక్ వంటి సన్ రైజర్స్ ఆటగాళ్లను, సన్ రైజర్స్ హెడ్ కోచ్ బ్రియాన్ లారాలకు బాలయ్య డైలాగును పలికే సవాల్ విసిరారు. అయితే, ఆ ఆటగాళ్లు… బాలకృష్ణ సినీ డైలాగులు పలికేందుకు తంటాలు పడ్డారు. ధోనీ గురించిన ఓ క్విజ్ లో ఒక ప్రశ్న తప్పు అడిగారంటూ బాలయ్య తన స్పోర్ట్ నాలెడ్జ్ ను చూపించారు. ధోనీ స్కూల్ రోజుల్లో తొలుత పాఠశాల హాకీ టీమ్ కు గోల్ కీపర్ అన్నది ఆ స్టేట్ మెంట్ సారాంశం. అందుకు బాలకృష్ణ వెంటనే అందుకున్నారు. ధోనీ బాల్యంలో తన స్కూల్ ల్లో గోల్ కీపర్ గా వ్యవహరించింది హాకీ టీమ్ కు కాదని, ఫుట్ బాల్ టీమ్ గోల్ కీపర్ అని కరెక్ట్ చేశారు. దాంతో ఇతర కామెంటేటర్లు బాలకృష్ణ క్రీడా పరిజ్ఞానాన్ని పొగిడారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version