సిట్ అధికారలు, టీపీసీసీ అగ్ర నేత రేవంత్ రెడ్డి మార్చి 31వ తేదీన సిట్ పై చేసిన వ్యాఖ్యల పై నేడు స్పదించారు. తాము ఎవరికి డేటా ఇవ్వలేదని కోర్టుకు నివేదికను ఇస్తామని తెలిపారు సిట్ అధికారులు. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ అభ్యర్థుల విచారణ పూర్తి చేశామని.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బోర్డు సభ్యులకు నోటీసులు జారీ చేశామని వెల్లడించారు సిట్ అధికారులు. బోర్డు ఛైర్మెన్, సెక్రెటరీ వాగ్మూలం రికార్డ్ చేస్తామన్నారు.ఇప్పటికే లింగా రెడ్డికి నోటీస్ జారీ చేసినట్లు తెలియచేశారు అధికారులు . సిట్ అధికారులు, లింగా రెడ్డి పీఏ రమేష్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. టీఎస్పీఎస్సీ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేసిన రమేష్ ఇచ్చిన వాగ్మూలంతో లింగా రెడ్డికి నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. పేపర్ లీకేజీ అంశం లింగా రెడ్డికి తెలుసా.. అనే కోణంలో అరా తీస్తున్నమని అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో 14 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని.. అందులో నాలుగు లక్షలు సీజ్ చేశామని అన్నారు సిట్ అధికారులు.
పేపర్ లీక్ కేసులో నిందితులకు కేటీఆర్ కు సంబంధమేంటని.. అసలు కేటీఆర్ కు ఎగ్జామ్ డేటా ఎలా వచ్చిందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అధికారులు కాకుండా కేటీఆర్ కు డేటా ఎవరిచ్చారో ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు రేవంత్. పేపర్ లీక్ కేసులో కావాల్సిన వాళ్లను కాపాడేందుకే సిట్ ఏర్పాటు చేశారని రేవంత్ వెల్లడించారు. గతంలో ఇలాగే సిట్ ఏర్పాటు చేసిన కేసులన్నీ తప్పుదోవపట్టించారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇరుకున పడ్డప్పుడల్లా సిట్ ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.పేపర్ లీక్ కేసులో ఏ1గా శంకర్ లక్ష్మీని చేర్చాలని డిమాండ్ చేశారు. శంకర్ లక్ష్మీకి తెలియకుండా ఏం జరగదన్నారు. ఆర్థిక పరమైన నేరారోపణలున్నప్పుడు కేసును ఈడీతో విచారణ జరిపించాలన్నారు ఆయన.