బాలయ్యా మజాకా…ఒక్క దెబ్బతో కొబ్బరి బొండాం తీసాడుగా….!

-

నందమూరి నట సింహం బాలకృష్ణ తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో ఆన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ టాక్ షో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టాక్ షో లను బీట్ చేసి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఈ టాక్ షో మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా మంచు ఫ్యామిలీ సభ్యులు అయిన మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీ లు వచ్చారు. ఆ తర్వాత బాలకృష్ణ చేతికి చిన్న సర్జరీ కావడంవల్ల కొంతకాలం పాటు ఈ టాక్ షో ఆగిపోయింది. ఆ తర్వాత బాలకృష్ణ చేతికి గాయం తగ్గిపోవడంతో తిరిగి ప్రారంభమైన ఈ టాక్ షో పేరుకు తగ్గట్టుగానే ఆన్ స్టాపబుల్ గా సాగిపోయింది. ఇది ఇలా ఉంటే ఈ టాక్ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.

ఈ టాక్ షో చివరి ఎపిసోడ్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు కు సంబంధించిన ఎపిసోడ్ ను ఆహా నిర్వహణ బృందం టెలికాస్ట్ చేయబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆహా నిర్వాహక బృందం ఆన్ స్టాపబుల్ లోని ఒక మాస్ ప్రోమో ను విడుదల చేసింది. ఈ ప్రోమో లో బాలకృష్ణ, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మి లతో ముచ్చటిస్తున్నాడు. అందులో భాగంగా బాలకృష్ణ ఈ ముగ్గురికి కొబ్బరి బొండాలను కొట్టి ఇచ్చాడు. అది మాత్రమే కాకుండా కత్తిని గాల్లోకి విసిరి కత్తి గాల్లో ఉండగానే చేతిలో పట్టుకున్నాడు. బాలకృష్ణ ఆ కొబ్బరి బొండాలను నలుగురు కలిసి చెస్ చెప్పుకొని మరి తాగుతున్నారు. అది మాత్రమే కాకుండా చార్మి బ్యాంకాక్ లో ఈ కొబ్బరి బొండాలలో వోడ్కా కలిపి ఇస్తారు అని చెప్పగా… బాలకృష్ణ అవన్నీ చేసే ఇక్కడికి వచ్చాము అని బాలకృష్ణ సరదాగా ఆన్సర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆన్ స్టాపబుల్ టాక్ షో కు సంబంధించిన ఈ ప్రోమో కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version