బాలకృష్ణ వీరసింహారెడ్డి ట్విట్టర్ రివ్యూ..!

-

డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా ఈరోజు ఉదయం రిలీజ్ అయింది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులలో మంచి ఆనందాన్ని, జోష్ ను నింపిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రీవియర్స్ తో సందడి చేసిన ఈ సినిమాను చూసి ఓవర్సీస్ ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.. ముఖ్యంగా నందమూరి నటసింహ బాలకృష్ణ పక్కన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.

ఇకపోతే వీర సింహారెడ్డి సినిమాపై పాజిటివ్ అలాగే నెగిటివ్ కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. కొంతమంది బాలయ్య మాస్ జాతర చేస్తున్నాడు..ఫస్ట్ హాఫ్ సూపర్.. యాక్షన్ సీన్స్ తో బాలయ్య అదుర్స్.. రచ్చ రచ్చ చేశాడు.. అంటూ రకరకాలుగా ఆయన అభిమానులు ట్విట్టర్లో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కానీ మరి కొంతమంది ఇంకాస్త ముందుకు వెళ్లి ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ అంటూ డిక్లేర్ చేస్తున్నారు. ఒకరేమో థియేటర్లో మాస్ జాతర జరుగుతోంది అంటూ మరికొంతమంది ట్వీట్ చేస్తున్నారు. ఇలా వరుసగా ట్విట్టర్ లో బాలయ్య సినిమాపై రివ్యూ చేస్తూ అదరగొట్టేస్తున్నారు అభిమానులు.

జై బాలయ్య అంటూ ప్రేక్షకుల నినాదాలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇది కదా సంక్రాంతి పండుగ అంటే అంటూ కూడా పండుగ రాకముందే స్పెషల్ ట్రీట్ లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య వన్ మ్యాన్ షో అంటూ మాస్ జనాలకు పూనకాలే అంటూ tweet చేస్తూ ఉండడం గమనార్హం. సోషల్ మీడియాలో రకరకాలు ట్వీట్లు చేస్తూ బాలయ్య గురించి పొగిడేస్తూ తెగ పండగ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి సినిమాకి కూడా నెగిటివ్ కామెంట్స్ తప్పలేదు. కొంతమంది పక్క ఫ్లాప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి కొంతమంది ఫోన్ ఫుల్ చార్జి పెట్టుకొని వెళ్ళండి. బోర్ ఫీల్ అవుతారు. సినిమాను చూడడం కంటే టైంపాస్ కోసం మీ ఫోన్ చూడడం బెటర్ అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version