మోక్షజ్ఞ లో భయం లేకుండా చేస్తున్న బాలయ్య బాబు..!!

-

నందమూరి బాలకృష్ణ వయస్సు పెరుగుతున్నా కూడా ఇంకా యువకుడి గానే చలాకీగా నటిస్తున్నారు. ప్రస్తుతం తాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి లో నటిస్తున్నారు.ఇక  తర్వాత సినిమా అనిల్ రావిపూడి తో చేస్తున్న సంగతి తెలిసిందే. దాని కోసం అనిల్ రావిపూడి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసారట. దీనిలో కూడా బాలయ్య కు తగ్గట్టుగా గా ఉండేలా యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ ఉండనున్నాయట.

ఇక రీసెంట్ గా గోవా ఫిలిం ఫెస్టివల్ లో బాలయ్య బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండను ప్రదర్శన సందర్బంగా తన కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు బాలయ్య బాబు.వచ్చే సంవత్సరం కచ్చితంగా తన కొడుకు మోక్షజ్ఞ సినిమా మొదలు కాబోతుంది అని అధికారికంగా ప్రకటించాడు. తన కుమారుడు వచ్చే సంవత్సరం టాలీవుడ్ లో ఖచ్చితంగా అడుగుపెడతాడని చెప్పారు.

ఇక దానికి తగ్గట్టు గానే బాలయ్య తన కొడుకు ను బయటకు రావడం స్టార్ట్ చేసారు. మోక్షజ్ఞ ఎక్కువగా బయటకి, సినిమా ఫంక్షన్స్ కు రావటం అరుదు. కాని బాలయ్య మెల్లిగా అతనిలో భయం పోగొట్టి, సినిమా వాతావరణం అలవాటు చేస్తున్నారు. ఇక రీసెంట్ గా జరిగిన హిట్ 2 స్పెషల్ షోకి బాలయ్యతో పాటు కొడుకు మోక్షజ్ఞ కూడా హాజరయ్యాడు. ఒక సినిమా ఈవెంట్ లో మోక్షజ్ఞ కనిపించడం ఇదే మొదటిసారి. అలాగే హీరో నాని, శేష్, బాలయ్య తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.హిట్ 2 టీమ్ తో పాటు మోక్షజ్ఞ విక్టరీ సింబల్ చూపిస్తూ పోజ్ ఇచ్చాడు. ఈ ఫోటోస్ ను బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version