NBK 107 నుంచి బాలయ్య లుక్ వైరల్..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

-

నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ‘అఖండ’ సినిమా సక్సెస్‌తో హీరో నందమూరి బాలకృష్ణకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా భారీ సక్సెస్ అందుకోవడంతో.. తనతోపాటు తన అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా తర్వాత అభిమానులు తన తర్వాతి చిత్రం కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు.

తెలుగు కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ మలినేనితో బాలయ్య నెక్ట్స్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్‌బీకే 107 వర్కింగ్ టైటిల్‌గా ఫిక్స్ చేశారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రాయలసీమ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా దర్శకుడు గోపిచంద్‌ మలినేని అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చారు. షూటింగ్‌ లో బాలయ్య వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌ లో దిగిన ఫోటోను షేర్‌ చేశారు. ఇందులో బాలయ్య వెరీ పవర్‌ ఫుల్‌ లుక్‌ లో కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version