ముఖ్యమంత్రి రేవంత్ పై మాజీ ఎమ్మెల్యే సుమన్ ఫైర్ అయ్యారు. గెలుపోటములు కొత్త కాదు. గెలిచినప్పుడు పొంగిపోలేదు ఓడినప్పుడు కుంగిపోలేదు అని అన్నారు. అలానే ఆంధ్ర పాలకుల నాయకత్వాన్ని ఎదిరించి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆయన అన్నారు. నువ్వు ముఖ్యమంత్రివి భాషను మార్చుకో అని అన్నారు. కెసిఆర్ బోండిక్కాయ పిసుకుడు, వంద మీటర్ల లోతుల BRS పార్టీని బొంద పెట్టుడు వంటివి మానుకోమన్నారు.
కేసీఆర్ వెంట్రుక కూడా పికలేవు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతు బందు పథకం ఇప్పటికీ వెయ్యలేదు అని కూడా అన్నారు. రూ.7700 కోట్ల రైతు బందు నిధులు ఉంచామని, ఆ డబ్బులను పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్, రాజగోపాల్ రెడ్డి సుశి ఇన్ఫ్రాకు తరలించారనే అనుమానం ఉందన్నారు. మా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పథకాల అకౌంట్ లను ఫ్రీజ్ చేశారు అని అది మంచి పద్దతి కాదన్నారు.