కాంగ్రెస్ ది కొత్త టాకీసులో పాత సినిమా – బాల్క సుమన్

-

కాంగ్రెస్ ది కొత్త టాకీసులో పాత సినిమా అని.. జాతీయ పార్టీలు తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నాయని ఎమ్మెల్యే బాల్క సుమన్ చురకలు అంటించారు. దాదాపు ఏడు దశాబ్దాలు కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పాలించాయని.. ఇప్పుడు రెండు పార్టీల నుండి విముక్తి కలగాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ కోసం కొట్లాడింది టీఆర్ఎస్ .. చావునోట్లో తలపెట్టింది కేసీఆర్ అని… తెలంగాణ ఉద్యమకారులపై నెలల పాటు నిర్బంధం, అర్దరాత్రి బైండోవర్లు చేశారు .. పండగలకు కూడా ఊరికి వెళ్లలేదని పేర్కొన్నారు.

అసలు ఉద్యమంలో లేనోడు .. చంద్రబాబు ఏజెంట్ రేవంత్, ఉద్యమంలో రాజీనామాలు చేయని ఉత్తమ్, పొన్నాలలు తెలంగాణకు మంచి చేస్తారట అంటూ విమర్శించారు. బండి, కిషన్, అరవింద్ అనెటోళ్లకు తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేదు, హాంద్రీనీవాకు హారతి పట్టిన డీకే అరుణలు కేసీఆర్ ను తిడ్తరని.. జరుగుతున్న కుట్రలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు.

తెలంగాణలో గుణాత్మక మార్పుకు కేసీఆర్ శ్రీకారం చుట్టడం జాతీయ పార్టీలకు రుచించడం లేదని.. తెలంగాణ పథకాలు, అభివృద్ధిని పక్క రాష్ట్రాల కాంగ్రెస్, బీజేపీ మంత్రులు, కేంద్రం అభినందించి వాస్తవం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మోడల్, అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు తమిళనాడు ద్రవిడ పార్టీల తరహాలో తెలంగాణ సమాజం సిద్దం కావాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version