ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.879 కోట్లు విడుదల

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి మోడీ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త అందించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పటికే ఎన్నో ఇష్యూలను ఎదుర్కొంటున్న ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి నిధులు విడుదల చేసింది మోడీ సర్కార్‌. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్ర ప్రదేశ్‌ సహా 14 రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ రెండో నెల వాయిదాగా రూ.7187.42 కోట్లు విడుదల చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆయా రాష్ట్రాల మొత్తం రెవెన్యూ లోటు గ్రాంట్‌ రూ.86,201 కోట్లు ఉంది. అందులో 14 రాష్ట్రాలకు పోస్ట్‌ డెవల్యూషన్‌ రెవెన్యూ లోటు గ్రాంట్‌ రెండో నెలవారీ వాయిదానున శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీకి సిఫార్సు చేసిన పోస్ట్‌ డెవల్యూషన్‌ రెవెన్యూ లోటు గ్రాంట్‌ రూ.10,549 కోట్లుగా ఉంది. ఇందులో భాగంగా… రెండో నెల విడతగా రూ.879.08 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం ఏపీ రాష్ట్రానికి కేంద్ర సర్కార్‌ అందించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version