రూపాయికి భరోసా లేదు.. అధిక ధరలకు అంతం లేదు : బాల్క సుమన్‌

-

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి టీఆర్ఎస్ యువ‌నేత, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దేశంలో చోటుచేసుకుంటున్న ప‌లు కీల‌క ప‌రిణామాల‌ను ఉదాహ‌ర‌ణంగా ప్ర‌స్తావిస్తూ సెటైర్లు సంధించారు బాల్క సుమ‌న్. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదికగా సుమ‌న్ బుధ‌వారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. రూపాయికి భరోసా లేదని.. అధిక ధరలకు అంతం లేదంటూ ఆరోపించారు బాల్క సుమన్‌. జీడీపీ నేల చూపులు చూస్తోంటే… ఆర్థిక వ్యవస్థ ఆగమై పోయిందని బాల్క సుమన్‌ ఎద్దేవా చేశారు.

దేశం చీకట్లో మగ్గిపోతోంటే… అదానీ, అంబానీలు వెలిగిపోతున్నారని బాల్క సుమన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యువతకు ఉద్యోగాల్లేవని… ప్రభుత్వ సంస్థలకు గ్యారంటీ లేదని ఆయ‌న మండిపడ్డారు. అంతేకాకుండా కమాల్ మోడీ .. ఢమాల్ ఇండియా పేరిట‌ దేశంలో బీజేపీ కొత్త నినాదం ఎత్తుకుంద‌ని దెప్పి పొడిచారు బాల్క సుమన్‌. రోజురోజుకు బీజేపీ ప్రభుత్వం చేతిలో ఇండియా పరిస్థితి దిగజారుతోందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version