వాళ్లకు కుటుంబాలు ఉన్నాయి.. వదలం : బీజేపి నేతలకు బాల్క సుమన్ వార్నింగ్ !

-

బిజేపి పార్టీ నేతలకు బాల్క సుమన్ వార్నింగ్ ఇచ్చారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి మీకు కుటుంబాలు ఉన్నాయి.. మీకు కుటుంబాలు ఉన్నాయి. వారిపై దాడి చేయటం మాకు పెద్ద విషయం కాదని ఫైర్ అయ్యారు బాల్క సుమన్. అభివృద్ధి విషయం లో పోటీ పడుదాం ఇలాంటి చిల్లర రాజకీయం కాదన్నారు బాల్క సుమన్. సోషల్ మీడియా లో దళిత ఎమ్యెల్యే ల పై ఫేక్ వీడియో లో వస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

మీడియా కూడా ఇలాంటి ఫేక్ వీడియో లను ప్రచారం చేయొద్దు అని విన్నపించారు. మా పై , మా కుటుంబం పై, మా అడవరిపై అసత్య పరచారం సారి కాదని బిజేపి పై ఫైర్ అయ్యారు. బీజేపీ ఇలాంటి నీచ పనులకు పాల్పడుతుంది. మేం కూడా చేయటం పెద్ద పని కాదు. కానీ మా విలువలు ఉన్నాయని చెప్పారు.

కేసును సుమోటోగా తీసుకొని చర్యలు చేపట్టాలని డీజీపీ ని కోరామని తెలిపారు. ఈ దాడులు ఆపకుంటే ఈటెల, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎవరిని వదిలే ప్రసక్తే లేదని.. రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ వ్యక్తి గత దాడి చేయటం చాలా తప్పు అని పేర్కొన్నారు. మీ మీద వీడియో లు తయారు చేయడం 5 నిమిషాల పని అని వార్నింగ్ ఇచ్చారు బాల్క సుమన్. వారిపై పోలీసులు చర్యలు తీసుకోక పోతే మేమే వారి అంతు చూస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version