హైదరాబాద్ లో ఉన్న బల్కం పేట ఎల్లమ్మ అమ్మవారి గుడి చాలా ఫెమస్ కాగ బల్కం పేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని జులై 5వ తేదీన నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బల్కం పేట ఎల్లమ్మ అమ్మ వారి కళ్యాణం మొదటి సారి జరగనుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.
అయితే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ సమయంలో సమర్పించే బోనాన్ని పూర్తిగా బంగారంతో చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదపు 2.5 కిలో గ్రాముల బంగారంతో ఈ బోనాన్ని చేయాలని భావిస్తున్నారు. ఎలమ్మ అమ్మవారికి మొక్కుల రూపంలో వచ్చిన బంగారంతోనే ఈ బోనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఆలయంలో ఉన్న రుద్రాక్ష మండపాన్ని కూడా రాతి రుద్రాక్ష మండపంగా ఏర్పాటు చేసి బంగారు తాపడం చేయాలని నిర్ణంచారు.