కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు : బల్మూర్ వెంకట్

-

కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారు అని MLC బల్మూర్ వెంకట్ అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్ కు ఊరట లభించలేదు. మతిస్థిమితం కోల్పోయి కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ కు హైదరాబాద్ పై ఒక స్పష్టత లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో బావ, బామ్మర్ది ఎన్నో స్కామ్లకు పాల్పడ్డారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో అడ్డమైన జీవోలు ఇచ్చి ప్రభుత్వ భూములను ప్రైవేటు రంగానికి, బిల్డర్లకు ఇచ్చి డబ్బులు దోచుకు తిన్నారు. కేటీఆర్ చేసిన అక్రమాలకు ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.

కరీంనగర్ అక్రమ ఇసుక రవాణా చేసింది మీ తమ్ముడు, మీ బాబాయ్ కాదా.. లిక్కర్ స్కామ్ లో చెల్లె కవిత ఇరుక్కుని ఊసలు లెక్క పెట్టింది నిజం కాదా.. చత్తీస్గడ్ లో అదానీ తో కెసిఆర్ చేసుకున్న అక్రమ ఎలక్ట్రిసిటీ ఒప్పందాల సంగతేంటి.. ఫోన్ టాపింగ్ విషయంలో ఆర్థిక, రాజకీయ అంశాలను చేర్చి దోపిడీకి తెరలేపింది కేటీఆర్. అసలు కేసిఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు. ఐటీ రంగంలో హైదరాబాదును అభివృద్ధి చేశామని ఒక బోగస్ ప్రచారానికి కేటీఆర్ తెరలేపాడు. ప్రభుత్వ శాఖల్లో కేటీఆర్ చేసిన అవినీతి చిట్టాను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నాం. BRS ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకువచ్చిన స్కామ్ కు దారి తీసింది. ఏసీబీకి పూర్తిస్థాయిలో సహకరించి నీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి. దోపిడీకి పాల్పడిన కేటీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు అని బల్మూర్ వెంకట్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news