శ్రీశైలంలో ప్లాస్టిక్‌పై నిషేధంపై ఈవో కీలక ప్రకటన చేశారు. జనవరి 1 నుంచి శ్రీశైలంలో ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటన చేశారు ఈవో. శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు EO పెద్దిరాజు తెలిపారు.
జనవరి 1 నుంచి ఆలయ పరిధిలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కవర్లపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్టు చెప్పారు. దీనిపై హోటళ్ల యజమానులకు అవగాహన కల్పించామన్నారు. ప్లాస్టిక్ పై ఆంక్షలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటుచేస్తామని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా, ఇవాళ విజయవాడ కు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రాను న్నారు. రాయనపాడు లో వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొననున్నారు నిర్మలా. ఇక రేపు తుమ్మలపల్లి కళాక్షేత్రం లో కృష్ణవేణి సంగీత నీరాజనంలో పాల్గొననున్న నిర్మలా…అనంతరం హైదరాబాదు వెళ్ళి, అటునుంచీ ఢిల్లీకి పయనమవనున్నారు.