కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వైపే మునుగోడు ముదిరాజ్‌లంతా : బండ ప్రకాశ్

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నికకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ కాంగ్రెస్‌, బీజేపీ, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ఎంతో మైలేజ్‌ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో మునుగోడులో ప్రచారాలు జోరుమీదున్నాయి. అయితే.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి మద్దతుగా మునుగోడు మండలం కొంపల్లి ఎంపీటీసీ పరిధిలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజ్ ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, బండ ప్రకాశ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ముదిరాజ్‌ల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వైపే మునుగోడు ముదిరాజ్‌లంతా ఉన్నారని శాసనమండలి సభ్యులు బండ ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు.

ప్రభుత్వం ముదిరాజ్‌ల ఆత్మగౌరవం కోసం కోకాపేటలో ముదిరాజ్‌లకు ఏడు అంతస్థుల భవన నిర్మాణం చేపడుతుందని పేర్కొన్నారు బండ ప్రకాశ్. ముదిరాజ్‌ల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని తెలిపారు. రాజీనామాతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అనుకుంటే ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏనాడు కూడా ముదిరాజ్ పేరు పెట్టుకొని ఉచ్చరించని నాయకులు హుజూరాబాద్ ఎన్నికల్లో ముదిరాజ్‌లమని గుర్తు చేశారని బండ ప్రకాశ్ ఆరోపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version