సిట్ విచారణతో ఒరిగేదేమిలేదని..సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి : బండి సంజయ్‌

-

మొయినాబాద్ ఫాంహౌస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. నిందితులు, ఫిర్యాదుదారులు, కోర్టులు చెప్పాల్సింది కూడా కేసీఆరే చెప్తున్నారని విమర్శించారు. నిష్పక్షపాతంగా విచారణ జరపాలనే తాము కోర్టుకు వెళ్లామని చెప్పారు బండి సంజయ్‌. సిట్ విచారణతో ఒరిగేదేమిలేదని..సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో బీజేపీ ఉందని కేసీఆరే చెప్పారని.. అందుకే కోర్టుకు వెళ్లామని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. నలుగురు ఎమ్మెల్యేలు బయటకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్‌.

ప్రధానిని రాష్ట్రానికి రావొద్దనడానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్‌. ప్రధాని ప్రోగాంకు రాలేక ఆహ్వానంపై అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు బండి సంజయ్‌. ప్రధాని పర్యటనపై రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం ఎలాగూ రైతులకు న్యాయం చేస్తలేడని.. ఆర్ఎఫ్సీఎల్ తో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు బండి సంజయ్‌. రాష్ట్రంలో పేదలకు ఎన్ని డబుల్ బెడ్ రూంలు ఇచ్చారని అడిగారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైందని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version