ఎన్నికలు ఎప్పుడొచ్చిన బీజేపీదే అధికారం : బండి సంజయ్‌

-

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర, ప్రజా గోస-బీజేపీ భరోసా విజయవంతం కావడంతో.. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం వచ్చిందని, ప్రజా సంగ్రామ యాత్రను కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు తక్కువ అంచనా వేశాయని అన్నారు బండి సంజయ్. జాతీయ పార్టీ నాయకత్వం తమకు అన్ని విధాలుగా అండగా ఉందని స్పష్టం చేశారు బండి సంజయ్. యాదాద్రి నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర సాగుతుందని వెల్లడించారు బండి సంజయ్.

పాలమూరులో పాదయాత్ర ద్వారా రాజకీయ సమీకరణాలు మారిపోయాయన్న బండి సంజయ్.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావిస్తున్నట్టు చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర తమతమ ప్రాంతాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు బండి సంజయ్. ఆగస్టు 2 నుంచి ప్రారంభంకానున్న పాదయాత్ర నిర్వాహణ కమిటీతో భేటీ అయ్యారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version