బ్రేకింగ్ : బండి సంజయ్ అరెస్ట్

-

ఈ రోజు అప్రజాస్వామికంగా తెలంగాణ పోలీసులు దుబ్బాక నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న రఘునందన్ రావు బంధువుల కుటుంబాలపై దాడి చేసి, సోదాలు చేయడం తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. దుబ్బాక శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో దాడులు,సోదాలు చేయడం ఎన్నికల నియమావాళికి విరుద్ధమని బండి సంజయ్ అన్నారు.

ఈ చర్య తెలంగాణ ప్రభుత్వ పోలీసు యంత్రాంగం యొక్క దుందుడుకు చర్యన్న ఆయన దాడి జరిగిన కుటుంబసబ్యులను కలవడానికి సిద్దిపేటకు బయలుదేరారు. అయితే సిద్దిపేట లో బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు సంజయ్ ని సిద్దిపేట నుండి కరీంనగర్ కి తీసుకెళ్తున్నారు. ఇక సిద్దిపేటకి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా వెళ్తున్నారు. చూడాలి మరి ఏమవుతుంది అనేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version