సీఎం కేసీఆర్ కు ఇంటి పోరు ప్రారంభం అయిందని.. తెలంగాణలో కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి చూస్తున్నాడని.. అందుకోసమే జాతీయ రాజకీయాలు అంటూ.. కొత్త డ్రామా ప్రారంభించారని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. సర్జికల్ స్ట్రైక్ పై వ్యాఖ్యలు చేసినందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్ ని డిమాండ్ చేశారు. పుట్టిన రోజున ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. చైానా, పాకిస్తాన్, తాలిబన్లపై కేసీఆర్ కు ప్రేమ పెరుగుతుందని .. పాత బస్తీ అంటే ఇప్పటికే ప్రేమ ఉందని ఆయన విమర్శించారు.
కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని ఇంటిపోరు. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలు: బండి సంజయ్
-