సర్జికల్ స్ట్రైక్ అంటే అది.. అర్థం చెప్పిన బండి సంజయ్

-

రోహింగ్యాలకు కాంగ్రెస్ , టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అక్రమంగా ఓటరు, ఆధార్ కార్డు లు ఇచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. వాళ్ళ ఓట్ల ద్వారా గెలవాలి అని  టీఆర్ఎస్, ఎంఐఎం అనుకుంటున్నాయని ఆయన అన్నారు. నా వ్యాఖ్యలు రాజకీయం చేయడం సిగ్గు చేటన్న అయన పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలు ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు.. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్జికల్ స్ట్రైక్ అంటే అప్పటికప్పుడు దాడులు చేసి..రోహింగ్యాల ను పంపించడం అని లేదా వాళ్ళు ఇక్కడే ఉంటే గోకుల్ చాట్ లాంటి సంఘటన లు జరుగుతాయని అన్నారు.

అలా జరిగితే ఎంఐఎం మాట్లాడదు..ఇక టీఆర్ఎస్ ఏమో చనిపోతే సంతాపం.. బతికితే పరిహారం ఇవ్వడానికి రెడీగా ఉంటుందని అన్నారు. సీఎం నా వ్యాఖ్యలకు స్పందించాల్సి ఉన్నా స్పందించలేదని అన్నారు. అసలు వాళ్ళని అంటే వీళ్లకు బాధ ఎందుకో ? అని సంజయ్ ప్రశ్నించారు. నాలుగు ఓట్ల కోసం టీఆర్ఎస్ ఎందుకు డ్రామా లు ఆడుతుంది అని ఆయన ప్రశ్నించారు. మాకు ఓట్లు సీట్లు కాదు, దేశము ముఖ్యం అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version