దొంగ లేఖ రాశారు.. సైబర్ క్రైంకు బండి సంజయ్ ఫిర్యాదు

-

గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల హడావుడి మొదలైపోయింది, నామినేషన్లకు మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. ఇప్పటికే టీఆర్ఎస్ ఒక జాబితా విడుదల చేయగా కాంగ్రెస్ రెండు జాబితాలను విడుదల చేసింది, బిజెపి ఒక జాబితా విడుదల చేసింది. అయితే ఈ క్రమంలో వరద సాయం నిలిపి వేయడం చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఎన్నికల కమిషన్ నిలిపివేసినా టిఆర్ఎస్ మాత్రం బీజేపీ రాసిన ఒక లేఖలో వల్ల ఈ ఎన్నికల సంఘం ఇలా చేసిందని ఆరోపించారు.

దానికి తోడు బండి సంజయ్ ఈ ఎన్నికల సహాయాన్ని నిలిపివేయాలని కోరుతూ రాసినట్టున్న ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ లేఖ తాను రాసింది కాదు అంటూ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆయన మండిపడ్డారు. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేద్దాం అంటూ టీఆర్ఎస్ కు ఆయన సవాల్ విసిరారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ లో ఆయన ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version