కేసీఆర్ నాందేడ్ సభపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ నిర్వహించిన జాతీయ సభ తుస్సు మంది. మహారాష్ట్ర జనం అసలు పట్టించుకోనేలేదని విమర్శలు చేశారు. 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు 25 రోజులుగా నాందేడ్ లోనే మకాం వేసి ఏర్పాట్లు చేసినా అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. చివరకు తెలంగాణ సరిహద్దు జిల్లాల నుండి ఒక్కొక్కరికి రూ.500లు ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి నాందేడ్ వేదికగా కేసీఆర్ పెద్ద డ్రామా చేశారు. తెలంగాణలోనే అతీగతి లేదు.. నాందేడ్ లో బీఆర్ఎస్ ను ఎవరు పట్టించుకుంటారు ? అని నిలదీశారు.
పెద్ద పెద్ద నాయకులు ఎవరెవరో చేరతారని ప్రచారం చేసుకున్నా.. చివరకు చేరిన అరొకర నాయకులంతా అవుట్ డేటేడ్ వాళ్లే. సొంత ఊరిలోనే 10 ఓట్లు కూడా వేసుకోలేని నాయకులే ఉన్నరు. వేల సంఖ్యలో బీఆర్ఎస్ కండువాలు తీసుకుపోతే… ఆ కండువాలు పట్టుకుని కేసీఆర్ నిలబడ్డా… ఎవరూ రాక విసుక్కున్నారంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటో అర్ధమవుతోందన్నారు. ఇగ ఆ సభలో, ఆ తరువాత జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ ప్రధానంగా నాలుగైదు అంశాలు ప్రస్తావించారు… బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం ప్రాతినిధ్యం పెంచుతారట. ప్రతి అసెంబ్లీ, కౌన్సిల్, పార్లమెంట్ లో 1/3 శాతం సీట్లు కేటాయిస్తారట అంటూ మండిపడ్డారు.
నోరు తెరిస్తే అబద్దాలే… మీ తొలి కేబినెట్ లో ఐదేండ్లపాటు ఒక్క మహిళను కూడా మంత్రిగా చేయలే.. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ను ఎందుకు నియమించలే. నామినేటెడ్ పోస్టుల్లో ఒక్క మహిళకు కూడా ఎందుకు అవకాశమియ్యలే. అంతెందుకు ఇప్పడున్న లోక్ సభ, రాజ్యసభ ఎంపీల్లో ఒక్కరైనా మహిళ ఉన్నారా? ఇవన్నీ నాందెడ్ సభలో ప్రస్తావిస్తే బాగుండేది. నీలాంటి పచ్చి అబద్దాల కోరు, మోసగాడు మహిళలకు 1/3 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెబుతుంటే జనం అసహ్యించుకుంటున్నారని నిప్పులు చెరిగారు.