బ్రిటిష్ వారి వల్లే కాలేదు.. కేసిఆర్ తో అయితదా..!

-

దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బాణసంచా కాల్చడం పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రజలందరికీ భారీ షాక్ తగిలింది. అటు ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. తాజాగా ఇదే విషయంపై స్పందించిన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

 

భారతదేశాన్ని 200 ఏళ్ళు పాలించిన ఆంగ్లేయులకే హిందువుల పండుగలు ఆపడం సాధ్యం కాలేదని అలాంటిది ముఖ్యం సీఎం కేసీఆర్ వల్ల అవుతుందా అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. హిందువుల మనోభావాలను కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అంటూ విమర్శలు గుప్పించారు. హైకోర్టులో బాణాసంచ నిషేధం పై సరైన వాదనలు వినిపించకపోవడం తోనే హైకోర్టు బాణసంచా నిషేధానికి తీర్పు ఇచ్చింది అంటూ విమర్శించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version