దేశంలో నెంబర్ వన్ అవినీతి పరుడు కేసీఆరే- బండి సంజయ్

-

దేశం నుంచి బీజేపీని తరిమికొడుతాడట… బీజేపీ పార్టీ వల్ల దేశం ఆగం అవుతుందని సీఎం కేసీఆర్ అంటున్నాడని.. నీవల్లే తెలంగాణ ఆగం అవ్వడం కనబడటం లేదా మాకు.. అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేసీఆర్ ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశంలో నీకన్నా పెద్ద అవినీతిపరుడు లేడని బండి సంజయ్ ఆరోపించాడు. నెంబర్ 1 అవినీతి పరుడివి నువ్వు అని కేసీఆర్ ని విమర్శించాడు. 2015లో చెన్నై నుంచి సీబీఐ వాళ్లు వచ్చి.. ఉదయం 9 నుంచి రాత్రి వరకు నిన్ను విచారించింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎవరికీ టైమ్ ఇవ్వడం లేదని.. దోచుకుంటున్నావు అని ఓ ఎంపీ సాక్షాత్తు పార్లమెంట్ లో ప్రశ్నిస్తే ప్రధాని మన్మోహన్ సింగ్ సారీ చెప్పాడని గుర్తు చేశారు. ఈఏస్ఐ, సహారా స్కామ్ చేశావంటూ ఆరోపించారు. ఈ విషయం తెలుసుకుని.. తెలంగాణ కోసం అంటూ రాజీనామా చేశారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version