జీవిత కాలం హిందూస్థాన్.. పాకిస్తాన్ అంతేనా ? : బీజేపీపై తలసాని సెటైర్లు

-

మీ జీవిత కాలం మొత్తం హిందూస్థాన్.. పాకిస్తాన్ అంతేనా అంటూ బీజేపీ పార్టీపై తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ వాళ్ళు ఎక్కువ మాట్లాడితే మీ సంగతి ఏమి అవుతుందో చూసుకోండని వార్నింగ్‌ ఇచ్చారు. మీరు పనికి రాని చేత గాని దద్దమ్మ లు అని.. తెలంగాణ అంటే ప్రధానికి కుళ్లు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

ఈక్వాలిటీ గురించి తెలియని ప్రధాని రామానుజ విగ్రహ ఆవిష్కరణ కి వచ్చి మాట్లాడతాడని.. కాంగ్రెస్ కి అతి గతి లేదు.. వాళ్ళ తో మాకు పొత్తు ఏంటి? అని నిలదీశారు.రోజుకు నాలుగైదు డ్రెస్సులు వేసుకుని ఫ్యాషన్ షో చేసే ప్రధాని మోదీ…తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కిషన్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

మూడేళ్లలో నిన్ను గెలిపించిన సికింద్రాబాద్ లో ఒక లక్ష రూపాయలు పని చేశారా..?అని ప్రశ్నించారు. హైదరాబాద్ వరదలప్పుడు కూడా పొలిటికల్ డ్రామాలు చేశారని విమర్శించారు. మీ ఇంకో బీజేపీ ఎంపీ బండిపోతే .. బండి ఇస్తా అన్నాడు కానీ ఒక రూపాయి అయినా ఇచ్చారా.. అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version