బండి వ్యూహాలు…సీన్ రిపీట్?

-

తెలంగాణ బీజేపీ పుంజుకోవడంలో బండి సంజయ్ పాత్ర చాలావరకు ఉందని చెప్పొచ్చు…అధ్యక్షుడు అయ్యాక బండి దూకుడు…బీజేపీకి కలిసొచ్చింది. బీజేపీ పుంజుకుంటున్న తరుణంలో పార్టీకి మరింత ఊపు తెచ్చేలా బండి కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఆయన పాదయాత్ర పార్టీకి మరింత ప్లస్ అయింది. మొత్తానికైతే బండి వల్ల బీజేపీకి ప్లస్ అయింది. ఇక ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపులో కీలక పాత్ర వహిస్తూ వచ్చారు. అయితే మరోసారి బీజేపీ గెలుపు కోసం బండి మునుగోడు బరిలో దిగనున్నారు.

ఇప్పటికే పాదయాత్ర ద్వారా మునుగోడు బీజేపీకి కొత్త ఊపు తీసుకొచ్చారు…అలాగే మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా తన పదునైన వ్యూహాలతో బండి రంగంలోకి దిగుతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో కూడా బండి చాలా జాగ్రత్తగా ముందుకెళ్లారు..ఈటల రాజేందర్ ఇమేజ్ ఉన్నా సరే…తనదైన శైలిలో అక్కడ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. కొన్ని రోజుల పాటు అక్కడే మకాం వేసి…ఈటల గెలుపు కోసం కష్టపడ్డారు.

ఇప్పుడే అదే తరహాలో మునుగోడులో బండి మకాం వేయనున్నారు. ఇప్పటికే మునుగోడులో పాదయాత్ర చేశారు. ఇక బండి పాదయాత్ర ఈ నెల 26తో ముగియనుంది…దీని తర్వాత బండి మునుగోడులోనే మకాం వేస్తారని తెలుస్తోంది. తమ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించుకోవడమే లక్ష్యంగా, నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే దిశగా ప్రత్యేక వ్యూహం అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇక్కడ విజయం సాధిస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఖాయమని బండి ధీమాతో ఉన్నారు.

నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో సంజయ్‌ పర్యటన ఉండే అవకాశం ఉంది. అలాగే కనీసం ఐదారు ప్రాంతాల్లో సభలు కూడా నిర్వహించే ఛాన్స్ ఉంది..అలాగే కాంగ్రెస్ పార్టీ పెట్టినట్లే మండలాల వారీగా ఇంచార్జ్ లని నియమించనున్నారు. అయితే మునుగోడులో బీజేపీకి బలం తక్కువ…టోటల్ గా రాజగోపాల్ ఇమేజ్ మీద ఆధారపడాలి…అదే సమయంలో ఇక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులని తమ వైపుకు తిప్పుకుంటే విజయం సులువు అవుతుందని బండి భావిస్తున్నారు. మొత్తానికి మునుగోడులో హుజూరాబాద్ సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version