ఒక మిస్డ్ కాల్ తో సిలెండర్ ని ఇలా బుక్ చెయ్యండి..!

-

మీకు గ్యాస్ సిలెండర్ కనెక్షన్ లేదా..? సిలెండర్ ని పొందాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చెయ్యండి. ఈ ఈజీ ప్రాసెస్ ని ఫాలో అయితే ఈజీగా సిలెండర్ ని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కొత్తగా సిలిండర్ కనెక్షన్ పొందాలని అనుకుంటే జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. మిస్డ్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్ పొందొచ్చు. ఈ విషయాన్ని స్వయంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL వెల్లడించింది.

gas

ఇక ఆ ప్రాసెస్ గురించి పూర్తిగా చూస్తే… గ్యాస్ సిలెండర్ పొందాలని అనుకునే వాళ్ళు 8454955555 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే కొత్త గ్యాస్ కనెక్షన్ పొందొచ్చని ఐఓసీఎల్ తెలిపింది. అయితే మిస్డ్ కాల్ ఇచ్చాక కంపెనీ డిస్ట్రిబ్యూటర్ మీకు కాల్ చేస్తారు. తర్వాత అడ్రస్ ప్రూఫ్, ఆధార్ అందిస్తే.. గ్యాస్ కనెక్షన్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీ ఫ్యామిలీ లో రెండో కనెక్షన్ కావాలని భావిస్తే.. అప్పుడు ఓల్డ్ కనెక్షన్‌కు అడ్రస్ ప్రూఫ్‌గా పరిగణ లోకి తీసుకుంటారు.

అయితే మిస్డ్ కాల్ ద్వారా కొత్త గ్యాస్ కనెక్షన్ అనేది ఇండేన్ గ్యాస్‌కు మాత్రమే వర్తిస్తుంది గమనించండి. అలానే గ్యాస్ కనెక్షన్ పొందాక ఇదే నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి లేదంటే 7718955555 నెంబర్‌కు కాల్ చేసి సిలిండర్ బుక్ చేసుకో వచ్చు. లేదు అంటే వాట్సాప్ ద్వారా అయితే 7588888824కు REFILL అని వాట్సాప్ చేయడం ద్వారా సిలిండర్ బుక్ చేసుకుని సిలెండర్ ని ఈజీగా పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version