ట్విట్టర్ టిల్లు..లిక్కర్ క్వీన్…హ్యాపీ రావు…అగ్గిపెట్టే రావు – బండి సంజయ్‌

-

ట్విట్టర్ టిల్లు..లిక్కర్ క్వీన్…హ్యాపీ రావు…అగ్గిపెట్టే రావు అంటూ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నలుగురే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నారని నిప్పులు చెరిగారు బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. రాబోయే రోజుల్లో యుద్ధం కొనసాగిస్తామని… కచ్చితంగా బిజెపి ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తెలంగాణ పరువు తీసిన కల్వకుంట్ల కుటుంబం మీద ఎన్ని వేల కోట్ల పరువు నష్ట దావా వేయాలంటూ ప్రశ్నించారు బండి సంజయ్. 30 లక్షల మంది యువత భవితకు విలువ ఇవ్వనోడి పరువు ఖరీదు రూ. 100 కోట్లట అని.. దేశంలోనే అందరికంటే ఎక్కువ జీతం తీసుకుంటూ ఏ బాధ్యతా నిర్వర్తించనోడు దేశ్ కీ నేతా అట అంటూ విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version