చంద్రశేఖర్ రెడ్డి పై ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి పై ఎం.ఎల్.ఏ.చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు మేకపాటి విక్రమ్ రెడ్డి.
ఎం.ఎల్.సి.ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతోనే సస్పెండ్ చేశారని వివరించారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ఇది సరైన నిర్ణయం అన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలు గెలుస్తామన్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ఉదయగిరి నుంచి మా కుటుంబ సభ్యుల పోటీ పై ముఖ్యమంత్రి జగన్… నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని చెప్పారు మేకపాటి విక్రమ్ రెడ్డి.