ఇంటి జాగా ఉన్న వాళ్లకు రూ.5 లక్షలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు బండి సంజయ్.ఇంటి జాగా ఉన్న వాళ్లందరికీ రూ.5 లక్షలిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పి రూ.3 లక్షలే ఇస్తానంటున్నారు. మాట తప్పి తప్పు చేశానంటూ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెంపలేసుకుని ప్రజలను క్షమాపణ కోరాలంటూ మహాగాం సభలో డిమాండ్ చేయడం జరిగిందన్నారు.
3వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ముథోల్ నియోజకవర్గంలోని మహాగాం చేరుకున్న మా బృందానికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ కేసీఆర్ వైఫల్యాలను వివరించడం జరిగింది.
‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద తెలంగాణకు మోడీ 2,40,000 ఇండ్లను మంజూరు చేశారు. తెలంగాణలో ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.4 వేల కోట్లకుపైగా నిధులిస్తే… ఆ సొమ్మును దారి మళ్లించిన ఘనుడు కేసీఆర్. ఆ నిధుల సంగతేమైందని కేంద్ర మంత్రి లేఖ రాసినా స్పందన లేదని స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు. రుణమాఫీ, డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భ్రుతి, దళిత, గిరిజనులకు 3 ఎకరాలుసహా ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదు. ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో మళ్లీ కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరదీశారన్నారు.