రజాకార్ సినిమాకి మినహాయింపు ఇవ్వండి: బండి సంజయ్

-

సీఎం రేవంత్ రెడ్డికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ లెటర్ రాశారు. రజాకార్ సినిమాకి పన్ను మినహాయింపు ఇవ్వాలని మంగళవారం రాసిన లేఖ లో రిక్వెస్ట్ చేశారు. విద్యార్థుల కోసం రజాకార్ సినిమా ప్రత్యేక షోలు వేయించాలని అన్నారు ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రం లో ఒక థియేటర్లో చిత్ర బృందంతో కలిసి బండి సంజయ్ రజాకర్ సినిమాని చూశారు.

తర్వాత ఆయన థియేటర్ వద్ద మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఈ సినిమా చూడాలని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు అందరూ ఈ సినిమాను చూసి ఓవైసీ పార్టీ ఎలాంటిదో తెలుసుకోవాలని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేయాలని తమ అభిమతం అని అన్నారు. ఎంత ఖర్చు అయినా ధైర్యంగా చిత్రాన్ని నిర్మించిన గూడూరు నారాయణరెడ్డి ని అభినందించారు దర్శకుడుని కూడా మెచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version