టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన బిజేపి అభ్యర్థి మల్క కొంరయ్య కరీంనగర్ పార్లమెంటు కార్యలయం వద్ద విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడికి బిజేపి కార్యకర్తలు భారీగా చేరుకోగా.. ఈ సంబరాలలో బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. ఈ సంఫర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజయం ప్రధాని మోడికి, మా కార్యకర్తలకి అంకితం. టాక్స్ సడలింపులకి కృతజ్ఞతలు గా ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజేపి అభ్యర్థి కొంరయ్య కి ఓటు వేసి గెలిపించారు.
ఉపాధ్యాయ సమస్యల కొసం 317 జీవో కొసం కొట్లాడి జైలుకి పోయింది బిజెపి పార్టీ. మా పోరాటాలని గుర్తించినారు కాబట్టే బిజెపి కి ఓటు వేసారు. తెలంగాణ లో ఏ ఎన్నికలు జరిగిన గెలవడానికి ఈ ఎన్నికలు ఆదర్శం. అభ్యర్థిని నిలబెట్టడానికి భయపడిన కాంగ్రెస్, బిఅర్ఎస్ పార్టీలు మమ్ములని ఓడగొట్టడానికి ప్రయత్నించారు. భవిష్యత్తు లో కూడ BRS, కాంగ్రెస్ పార్టీలు ఒకటి అవుతారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలని గుర్తించాలి. స్థానికసంస్థల ఎన్నికలలో ఇదే జోష్ తో పనిచేయాలి అని బండి పేర్కొన్నారు.